KNR: కరీంనగర్‌లోని యజ్ఞ వరాహస్వామి దేవాలయానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. భక్తులకు ఆధునిక సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే దీని ఉద్దేశమని తెలిపారు. వెబ్‌సైట్ ద్వారా పూజలు, సేవలు, ఉత్సవాల వివరాలు, దర్శన సమయాలు, ఆలయ విశేషాలను సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
వార్తలు
యజ్ఞ వరాహస్వామి ఆలయానికి వెబ్‌సైట్ ప్రారంభం


