హైదరాబాద్: 28°C
వార్తలు

2 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

ADB: గంజాయి కేసులో 2 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడు షేక్ మగ్దూం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ CI నాగరాజు బుధవారం తెలియజేశారు. 2024 అక్టోబర్‌లో ఆదిలాబాద్ టూ టౌన్‌లో నమోదైన కేసులో నిందితుడు స్థానిక షేక్ ఈసా, కటారి వెంకట్‌తో కలిసి గంజాయి విక్రయాలు సాగించినట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రేతలపై కఠిన చర్యలు తప్పవని CI హెచ్చరించారు.