హైదరాబాద్: 28°C
వార్తలు

కార్డెన్ సెర్చ్ లో 14 వాహనాలు సీజ్

NLR: కోవూరు పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ను నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, నేర నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కాలనీలో ఎవరైనా అనుమాన వ్యక్తులు తిరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.