హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై దాడి చేసిన వారెవరు?: రాహుల్

విద్యార్థులపై దాడులకు సంబంధించి కొన్ని ప్రశ్నలను సంధిస్తూ ఈనెల 25న కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పోలీసులు వాడకపోతే.. ఆ పని ఎవరు చేశారని తాను ప్రశ్నించినట్లు చెప్పారు. పెల్లెట్ గన్స్ వాడాలని ఆదేశించిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. దాడులకు పాల్పడిన పోలీసు అధికారుల ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.