విద్యార్థులపై దాడులకు హోంమంత్రి అమిత్ షానే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని ఆదేశాల మేరకు హోంమంత్రి అలా చేశారని తెలిపారు. పోలీసు అధికారులతో అమిత్ షా ఫోన్‌లో మాట్లాడడం తాను స్వయంగా చూశానని రాహుల్ పేర్కొన్నారు. లాఠీలు, ఎలక్ట్రిక్ వస్తువులతో దాడి చేయాలని ఆదేశాలు వచ్చాయని అన్నారు. దాడికి గురైన ప్రతి చిన్నారికి ఈ విషయం తెలుసని పేర్కొన్నారు.
వార్తలు
అమిత్ షా ఆదేశాలతోనే దాడులు: రాహుల్


