హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు స్వచ్ఛంద రక్తదాన శిబిరం

W.G: జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు నరసాపురం MPDO నందు రేపు ఉదయం 10 గంటల నుంచి స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించబడుతుందని MDOM నాసరు రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తాదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం-మహాదానం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలన్నారు.