హైదరాబాద్: 28°C
వార్తలు

ఫామ్ పాండ్ పనుల పురోగతి సమీక్ష

SRD: కొండాపూర్ మండలంలో ఫామ్ పాండ్ పనుల పురోగతిని అదనపు కలెక్టర్ పాండు పరిశీలించారు. జిల్లా పరిషత్ CEO, డిప్యూటీ CEO, అసిస్టెంట్ PDలతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం గంగారం గ్రామంలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యత, పనుల వేగం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో MPDO, APO, ECలు, TAలు, APM, CCలు పాల్గొన్నారు.