హైదరాబాద్: 28°C
వార్తలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.2.91 లక్షలు!

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,91,405 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 283 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 22 మంది భక్తులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 2028 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.