హైదరాబాద్: 28°C
వార్తలు

'వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలి'

ATP: సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వెల్ఫేర్ సెక్టార్‌పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నాడు-నేడు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు.