SKLM: గార మండలం లింగాలవలస మీదుగా సానివాడ, ఒప్పంగి, చెట్టువానిపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి రాళ్లు తేలి అధ్వానంగా మారింది. పదునైన రాళ్ల కారణంగా ద్విచక్ర వాహనాల టైర్లకు పిక్కలు గుచ్చుకుని పలుమార్లు టైర్లు పేలిన ఘటనలు జరిగాయని గ్రామస్థులు తెలిపారు. రాకపోకలు ఇబ్బందికరంగా మారడంతో ప్రమాదాలు జరగకముందే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు.
వార్తలు
రాళ్ల రహదరితో నిత్యం ఇబ్బందులు


