హైదరాబాద్: 28°C
వార్తలు

సాయంత్రం రాహుల్‌ మీడియా సమావేశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్‌లో తాను మాట్లాడకుండా అడ్డుకున్నారని, మైక్‌ను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్‌ చేశారని రాహుల్ పేర్కొన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి తాను చెప్పాలనుకున్న విషయాలను ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన 'X'లో పోస్ట్ చేశారు.