కోనసీమ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దస్తావేజు లేఖరుల పట్ల తీవ్ర అన్యాయానికి ఒడిగడుతోందని వైసీపీ అమలాపురం నియోజకవర్గ కన్వీనర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. అమలాపురం రూరల్ మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద జరుగుతున్న దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘాల సమ్మెలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. వీరి సమ్మెకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని శ్రీకాంత్ తెలిపారు.
వార్తలు
దస్తావేజు లేఖర్ల సమ్మెకు వైసీపీ సంపూర్ణ మద్దతు!


