హైదరాబాద్: 28°C
వార్తలు

డిజిటల్ వ్యవసాయంపై శిక్షణ

పార్వతీపురం మండలం డి.కె.పట్నం రైతు సేవా కేంద్రం పరిధిలోని లీడికివలసలో వ్యవసాయ శాఖ, ఆత్మ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీఎయిమ్స్ 2.0 యాప్ వినియోగం, డిజిటల్ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ఎం. అశోక్ మాట్లాడుతూ.. రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ఎరువుల పారదర్శక పంపిణీకి డిజిటల్ పద్ధతులు వాడాలని కోరారు.