హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సు డ్రైవర్ ఇంట్లో 10 కిలోల బంగారం

బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లాలో మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో జరిగిన పోలీసుల సోదాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. మినార్ మోండల్ అనే వ్యక్తి ఇంట్లో జరిపిన తనిఖీల్లో సుమారు రూ. 6 కోట్ల నగదు, అలాగే 10 కిలోల బంగారం లభ్యమైంది. సాధారణ డ్రైవర్ ఇల్లు కావడంతో ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే ఇక్కడ దాచిపెట్టారా అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.