హైదరాబాద్: 28°C
వార్తలు

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జేసీ

ASR: నెలవారీ తనిఖీల్లో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ పాడేరు డిగ్రీ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఎన్నికల అధికారులతో కలిసి ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీల్స్, సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారం భద్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.