SKLM: గార మండలం అంబళ్లవలస ప్రాథమిక పాఠశాలలో విధులకు మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయుడిని తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ధర్నా చేపట్టారు. ఈ విషయమై MEO, DEOలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఉపాధ్యాయుడు బదిలీ కోరుతూ ధర్నా


