హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని పేరుతో నకిలీ వీడియో

ప్రధాని మోదీకి సంబంధించిన ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించింది. వైరల్ అవుతున్న ఆ వీడియో.. మార్ఫింగ్ చేసిన వీడియో అని స్పష్టతనిచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, నకిలీ వీడియోలను నమ్మవద్దని తెలిపింది.