హైదరాబాద్: 28°C
వార్తలు

జలసిరిపై ప్రత్యేక గ్రామసభ

నిజామాబాద్ గ్రామ పంచాయతీలో జలసిరి అంశంపై బుధవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దూరి మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్ రీఛార్జ్ చేసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.