హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుపై కేసులు ఎత్తివేయాలి: డీవైఎఫ్‌ఐ

WNP: జిల్లాలోని అంబేద్కర్ చౌక్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థి, యువజన నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని జిల్లా కార్యదర్శి గడ్డికోపుల మహేష్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించాలని కోరారు. లేకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.