హైదరాబాద్: 28°C
వార్తలు

పరిశోధన కేంద్రం స్వర్ణోత్సవాల నిర్వహణ

ASR: గత ఐదు దశాబ్దాలుగా కాఫీ పరిశోధన, పర్యావరణ పరిరక్షణలో ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. కాఫీ పరిశోధన కేంద్రం స్థాపించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల నిర్వహణపై బుధవారం సమావేశం నిర్వహించారు. 1971లో 15టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తి, ప్రస్తుతం 15వేల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు.