హైదరాబాద్: 28°C
వార్తలు

స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

E.G: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద బుధవారం మధ్యాహ్నంకి గోదావరి నీటిమట్టం 10.90 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరే వరద నీరు స్వల్పంగా తగ్గింది. ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్ గేట్లు ద్వారా 95,240 క్యూసెక్కుల గోదావరి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టాలకు అవసరమైన సాగునీటిని సరఫరా చేశారు.