హైదరాబాద్: 28°C
వార్తలు

కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం లభించింది. ఈ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా, విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణలు వీగిపోయాయి. ఈ కొత్త చట్టం ద్వారా పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.