హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 'విద్యార్థులపై ఫైరింగ్‌కు హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారా? లేకపోతే ఆయనకు తెలియకుండా జరిగిందా?' అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఒకవేళ ఈ ఘటనకు హోంమంత్రే ఆదేశాలు ఇచ్చి ఉంటే అది ఆయన తప్పు అవుతుందని, అలా కాకుండా ఆయనకు తెలియకుండానే జరిగి ఉంటే అది పూర్తిగా హోంమంత్రి అసమర్థతే అవుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
వార్తలు
అమిత్ షాపై రాహుల్ ప్రశ్నల వర్షం


