హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ మరోసారి వాయిదా

లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2:30 గంటలకు పునఃప్రారంభమైన సభ మరోసారి వాయిదా పడింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికార పక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులు సైతం దానికి ప్రతిగా నినాదాలు హోరెత్తించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3:00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.