హైదరాబాద్: 28°C
వార్తలు

'అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి'

SRPT: హుజూర్ నగర్ మండల పరిధిలోని వేములూరి వాగులో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లతో ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు తగ్గడంతో పాటు పంట పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వేమూలూరి వాగు వద్ద శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు.