హైదరాబాద్: 28°C
వార్తలు

అశ్వాపురంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

BDK: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అశ్వాపురం పట్టణంలోని పలు షాపుల్లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.