కోనసీమ: ఆత్రేయపురం (మం) కట్టుంగ, తాడిపూడి గ్రామాల్లో నిర్వహించిన "ఇంటింటికీ కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పింఛన్ల పెంపు, తల్లికి వందన, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు.
వార్తలు
ఎమ్మెల్యే బండారు ఇంటింటా ప్రచారం


