హైదరాబాద్: 28°C
వార్తలు

పెనుకొండ శాఖ గ్రంథాలయం తనిఖీ

SS: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వెంకట్ పెనుకొండ శాఖ గ్రంథాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. పాఠకులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గ్రంథాలయ అధికారి మహబూబ్ బాషాతో సమీక్ష నిర్వహించి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు.