హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూటమి ఘనత కాదు: ధర్మాన

VSP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ 2026 జూలై నాటికి పూర్తవుతాయని వైఎస్ జగన్ అప్పట్లోనే చెప్పారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బుధవారం మద్దిలపాలెం YCP ఆఫీస్‌లో మాట్లాడుతూ.. వైసిపి హయాంలో రూ.1200 కోట్ల రాష్ట్ర నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.