హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ATP: గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవోకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ బుధవారం గ్రామాన్ని సందర్శించి తాగునీటి బోర్లను పరిశీలించారు. చెరువులో ఉన్న రెండు బోర్లను త్వరలోనే మరమ్మతులు చేసి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు తెలిపారు.