MLG: కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో భారీ వర్షాలతో బుధవారం వరద నీరు ఇళ్లలోకి చేరింది. పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు నీటిలో తడిసిపోయాయి. అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి వరద నీటిని తొలగించి బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వార్తలు
ముప్పనపల్లి గ్రామంలోకి వరద నీరు.. ప్రజల అవస్థలు


