హైదరాబాద్: 28°C
వార్తలు

క్లాస్‌లో ఉండగానే నన్ను అరెస్ట్ చేశారు: నడ్డా

కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే, కేంద్రమంత్రి జేపీ నడ్డా మధ్య రాజ్యసభలో మాటల యుద్ధం జరిగింది. 'విద్యార్థులపై దాడి చేసినవారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు. దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు' అని ఖర్గే అన్నారు. దీనిపై నడ్డా స్పందిస్తూ.. ఎమర్జెన్సీ సమయంలో తాను క్లాస్‌లో ఉండగానే అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.