కోనసీమ: ఆలమూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామివారికి గ్రామానికి చెందిన వెత్సా జవహర్‌లాల్ నెహ్రూ, నాగలక్ష్మి దంపతులు రూ.60 వేల విలువైన సాలగ్రామ హారాన్ని బుధవారం సమర్పించారు. గండకీ నదిలో లభించే పవిత్ర సాలగ్రామాలతో, 22 గ్రాముల వెండితో తయారు చేసిన హారాన్ని అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరించారు.
వార్తలు
జనార్ధన స్వామికి రూ. 60వేలు విలువ చేసే హారం సమర్పణ


