హైదరాబాద్: 28°C
వార్తలు

బొగత జలపాతం సందర్శన నిలిపివేత

TG: ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాక అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.