హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన అల్లీపూర్ బ్రిడ్జ్.. తీవ్ర ఇబ్బందుల్లో రైతులు

MDK: శివంపేటలోని అల్లీపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దుబ్బ పొలాల వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి దెబ్బతినడంతో వ్యవసాయ యంత్రాలు పొలాల్లోకి వెళ్లే మార్గం లేక సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక రాకపోకల మార్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని రైతులు కోరుతున్నారు.