MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి అటవీ సమీపంలో ఉన్న లోతు వాగు నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బుధవారం పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఈ వాగుపై తక్షణమే హైలెవల్ వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ఉద్ధృతంగా లోతు వాగు..రాకపోకలకు అంతరాయం


