హైదరాబాద్: 28°C
వార్తలు

మావోయిస్టు అగ్రనేత అరెస్టు

ఝార్ఖండ్ మావోయిస్టు అగ్రనేత మిషిర్ బెస్రాను పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మిషిర్ బెస్రాపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. పలు దాడుల్లో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అతడి కోసం ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ బలగాలు గాలింపు చేపట్టాయి. మార్చి 31 నుంచి గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కాగా, నిన్న 16 మంది మావోలు లొంగిపోయారు.