కోనసీమ: కాట్రేనికోనలో ఏళ్ల తరబడి నిర్మాణం లోనే నిలిచిపోయిన వ్యవసాయ శాఖ భవనం ప్రస్తుతం మందు బాబులకు అడ్డాగా మారింది. రాత్రి వేళలలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. భవనం చుట్టు ప్రక్కల కాలీ మందు సీసాలు దర్శనం ఇస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, భవన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: మందు బాబులకు అడ్డాగా వ్యవసాయ శాఖ భవనం


