చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా చక్కెర డీలర్లు 30 రోజులకు మించి స్టాకు నిలువ ఉంచరాదని, గరిష్ఠంగా 4 వేల కింటాళ్ల వరకూ మాత్రమే నిల్వ ఉంచాలని ఆదేశించింది. ఏ సమయంలోనైనా, ఏ స్థలంలోనైనా ఇంతకు మించి నిల్వలు ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన లెక్కలను ప్రతిరోజూ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని పేర్కొంది.
వార్తలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


