హైదరాబాద్: 28°C
వార్తలు

'జిల్లాలో మాజీ సీఎం పర్యటన.. స్వాగత ఏర్పాట్లు'

VZM: మాజీ CM జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా మీదుగా రోడ్డు మార్గంలో ఆయన శ్రీకాకుళం చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో YCP నేతలు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురంతో పాటు నాతవలస టోల్ గెట్, పూసపాటిరేగ లో అధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.