హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో బుధవారం సింగరేణి డివిజన్‌లోని కాకతీయ ఓపెన్‌కాస్ట్-2, 3 గనుల్లోకి వరదనీరు చేరింది. గనుల్లో సుమారు 42 శాతం మేర నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు వెలికితీసే యంత్రాలు బురదలో కూరుకుపోవడంతో సుమారు 9 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.