హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆదోనిలో అమ్మవార్ల ఉత్సవ వేడుకలు

KRNL: ఆదోని చిన్న మార్కెట్లోని శ్రీ మారమ్మ, శ్రీ సుంకులమ్మ అమ్మవార్ల సాలువ బిందెల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పవిత్ర జలాలతో అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలకు సుఖశాంతులు కలగాలని, లోకక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వందలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.