హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్రపూజల కలకలం

GDWL: గద్వాల రాఘవేంద్ర కాలనీ ప్రభుత్వ పాఠశాల ముందు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు వేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. తెల్లవారుజామున ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పౌర్ణమి కావడంతోనే ఎవరో ఉద్దేశపూర్వకంగా క్షుద్రపూజల నెపంతో ఈ చర్యకు పాల్పడ్డారని కాలనీవాసులు అనుమానిస్తున్నారు.