హైదరాబాద్: 28°C
వార్తలు

రిటైర్డ్ ఇంజినీర్ పై దాడి..!

ELR: చాటపర్రుకు చెందిన రిటైర్డ్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ కనకాము సాయిప్రసాద్ తనపై దాడి జరిగిందని మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఎంఆర్ రోడ్డు నిర్మాణ అవకతవకలపై పై అధికారులకు ఫిర్యాదు చేయడంతోనే, ఈనెల 18న కార్పొరేషన్ కార్యాలయంలో తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.