హైదరాబాద్: 28°C
వార్తలు

తత్కాల్‌ టికెట్ల జారీలో మార్పులు

తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో సమస్యలను సులభతరం చేయడానికి రైల్వే చర్యలు చేపట్టింది. ప.మ. రైల్వే పరిధిలోని రైల్వే రిజర్వేషన్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద తత్కాల్‌ టికెట్ల జారీ ప్రక్రియలో ఆగస్టు 1 నుంచి మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నుంచి ప్రయాణికులకు టోకెన్‌ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. రద్దీని, కౌంటర్ల వద్ద తోపులాటలను అరికట్టనున్నారు.