హైదరాబాద్: 28°C
వార్తలు

'నీటి హక్కుల కోసం రేపు పాదయాత్ర'

ATP: రాయలసీమ సాగు, తాగునీటి హక్కుల కోసం రేపు పాదయాత్ర చేపడుతున్నట్లు రాప్తాడు వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. న్యామద్దల సమీపంలోని హంద్రీ-నీవా కాలువ 34వ కి.మీ రాయి వద్ద పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.