హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి పాలనపై MLA ఇంటింటి ప్రచారం

E.G: గోపాలపురం మండలం గంగోలు గ్రామంలో 'రెండు ఏళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని నేరుగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.