హైదరాబాద్: 28°C
వార్తలు

నాగరాజు క్వాష్ పిటిషన్‌లో కీలక అంశాలు

AP: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో A-1 నిందితుడిగా ఉన్న CI నాగరాజు.. తనపై హత్య కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవని.. కేవలం సాక్షుల వాంగ్మూలం ఆధారంగానే కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇప్పటి వరకూ మృతదేహాన్ని గుర్తించలేదని, హత్య జరిగినట్లు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగే ఛాన్సుంది.