నీట్ పేపర్ లీకైనట్లు విద్యాశాఖ ఫిర్యాదు చేయడంతో మే 12న కేసు నమోదు చేసినట్లు CBI తెలిపింది. 72 మంది అధికారులు, 8 మంది సైబర్ నిపుణులతో బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొంది. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యాణా, ఢిల్లీ సహా 92 ప్రాంతాల్లో సోదాలు చేశామని వెల్లడించింది. డిజిటల్ పరికరాలు, పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకొని 13 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశామంది.
వార్తలు
నీట్ పేపర్ లీక్.. మే 12నే కేసు నమోదు


