హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ కేసు.. CBI ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు

నీట్ పేపర్ లీక్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జ్‌‌షీట్‌లో కీలక అంశాలను పొందుపరిచింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, సాక్ష్యాల ధ్వంసం కింద కేసులను నమోదు చేసింది. మొత్తం 360 మంది సాక్ష్యాలను నమోదు చేసినట్లు తెలిపింది. 422 పత్రాలు, 43 మెటీరియల్ ఆబ్జెక్టులను ఛార్జ్‌షీట్‌లో CBI పేర్కొంది. నిందితులంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించింది.